హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా..!!

హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా చేయడానికి, ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతికి ఆధారాలిస్తున్నారు. దాంతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న శ్రీనివాసులపై ఏసీబీ దాడి చేసింది. ఆయనది అత్యంత లగ్డరీ లైఫ్.మోహోంభూజాలోని సొంత నివాసంలో ఉంటారు. ఆయన ఆస్తులు వంద కోట్లకుపైగానే లెక్క తేలాయి. బినామీ పేర్లతో రైస్ మిల్లులు కూడా నడుపుతున్నారు. ఆయన గురించి ఏసీబీకి సమాచారం ఇచ్చింది హైడ్రా అధికారి రంగనాథ్. కూకట్ పల్లి చెరువులో ఎఫ్ టీఎల్ నిర్మాణాలకు ఆయన..రికార్డులు మార్చి.. ట్యాంపర్ చేసి అనుమతులు ఇచ్చి లంచాలు తీసుకున్నారు. దీన్ని గుర్తించిన రంగనాథ్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి అ లంచావతారాన్ని పట్టుకున్నారు.

కబ్జాకు గురి అయిన ప్రతి చెరువు విషయంలో రంగనాథ్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే.. దానికి సహకరించిన అధికారులందరి జాబితాను రెడీ చేయిస్తున్నారు. వారి అవినీతిపై ఆరా తీసి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అంటే.. ఇప్పుడు రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా అనుకోవచ్చు..!!

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 3 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు