🌧️ జోరు వానను సైతం లెక్కచేయకుండా రక్తదాన శిబిరానికి తరలివచ్చిన పొంగులేటి అభిమానులు!
సేవా స్ఫూర్తికి వర్షం అడ్డుకాదు.. ప్రాణదానానికి అభిమానుల ముందడుగు!
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఆయన అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరానికి తరలివచ్చి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకొచ్చిన అభిమానుల ఉత్సాహం, మానవతా దృక్పథం పలువురిని ఆకట్టుకున్నాయి.
రక్తదానం మహాదానం.. ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం! అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన రోగులకు అండగా నిలవాలనే గొప్ప సంకల్పాన్ని అభిమానులు చాటుకున్నారు.
తమ అభిమాన నాయకుడి జన్మదినాన్ని సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ద్వారా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటిచెప్పారు. ప్రకృతి సైతం పరీక్షించినా, సేవా సంకల్పంతో ముందుకు సాగిన పొంగులేటి అభిమానుల నిబద్ధత అభినందనీయం.
జన్మదిన వేడుకలు అంటే సంబరాలే కాదు.. ఆపదలో ఉన్నవారి జీవితాల్లో వెలుగులు నింపే సేవా కార్యక్రమాలు కూడా! అన్న సందేశాన్ని ఈ రక్తదాన శిబిరం చాటిచెప్పింది.
ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దినేని స్వర్ణకుమారి టిపిసిసి అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి టెలికాం అడ్వైజర్ కమిటీ డైరెక్టర్లు ఉమ్మినేని కృష్ణ, ఇమామ్ బాయ్, మాజీ కార్పొరేటర్ కొప్పెర ఉపేందర్ కేకేసి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విప్లవ కుమార్ పటేల్ వైరా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మారోశయ్య, కొనిజర్ల మాజీ ఎంపీపీ గోసుమధు,జిలాని, D S N రాజు,మొగిలిచర్ల సైదులు, తోట ప్రసాద్, తిరుపతి రావు,గుండపనేని నరసింహరావు, గురుమూర్తి, కరటి వేణు, కె రమేష్, జంగిపల్లి ప్రసాద్ మరియు శ్రీనివాస్ రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
ponguletisrinivasreddy #happybirthday #Srinanna
Kkc Khammam
Unorganized Workers and Employees Congress (KKC)
Telangana Congress








