







సత్తుపల్లిలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకలు
విజేత జట్లకు బహుమతులు అందజేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా..
సత్తుపల్లి, అక్టోబర్ 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు
గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలోని రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్లో అక్టోబర్ 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించిన 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన జట్లకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి శ్రీమతి పొంగులేటి మాధురి గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ గారు, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య గారు, భద్రాచలం ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు గారు, పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వరరావు గారు, అశ్వారావుపేట ఎమ్మెల్యే శ్రీ జారె ఆదినారాయణ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు, రాష్ట్ర TGIDC మాజీ చైర్మన్ శ్రీ మువ్వా విజయ్ బాబు గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న గారు పాల్గొన్నారు.
అలాగే కటికాల క్రిస్టఫర్ బాబు (స్టేట్ వైస్ ప్రెసిడెంట్, ఖమ్మం జిల్లా సెక్రటరీ), కె. స్వాతిముత్యం (స్టేట్ జాయింట్ సెక్రటరీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రటరీ), చి. సుధాకర్ (ఖమ్మం జిల్లా జాయింట్ సెక్రటరీ), సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ఎం.డి. రహేన కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన�





