
హైదరాబాదులో అవినీతి అనకొండ..!!
20. లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్… సర్వేయర్..!!!
హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని ఏకంగా రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడటంతో చివరకు రూ.20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు..!!





