అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలి

పనుల పూర్తికి అధికారులు పర్యవేక్షణ చేయాలి

అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి

ఖమ్మం, అక్టోబర్ -26 (( మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు))

పాలేరు నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, నిర్ణీత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ లోని క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఇంజనీరింగ్, ఇరిగేషన్, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, నిధుల మంజూరుపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడూతూ, అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని తెలిపారు. భూసేకరణ, ఇతర సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకంగా మారిన విద్యుత్ స్తంభాలను త్వరితగతిన షిఫ్ట్ చేసేలా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.

అభివృద్ధి పనుల్లో భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరిగేలా, భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు ఇచ్చే దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో పనుల బిల్లుల చెల్లింపుకు ఎలాంటి కొరత లేకుండా చూసేందుకు ప్రతి నెల 20 కోట్ల నుండి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున నీరు, విద్యుత్‌లను అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరించడానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు రెండో పంట వేయకూడదని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించి, స్పష్టమైన సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సిఈ వాసంతి, ఎస్ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎస్ఈ యుగంధర్ రావు, పిఆర్ ఎస్ఈ వెంకట్ రెడ్డి, విద్యుత్ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శేఖర్ రెడ్డి, మెడికల్ ఈ ఈ ఉమామహేశ్వర రావు, జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య, వివిధ ఇంజనీరింగ్ శాఖల ఈఈ లు, డిఈ లు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    సత్తుపల్లిలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకలు విజేత జట్లకు బహుమతులు అందజేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా.. సత్తుపల్లి, అక్టోబర్ 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి…

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    🌧️ జోరు వానను సైతం లెక్కచేయకుండా రక్తదాన శిబిరానికి తరలివచ్చిన పొంగులేటి అభిమానులు! సేవా స్ఫూర్తికి వర్షం అడ్డుకాదు.. ప్రాణదానానికి అభిమానుల ముందడుగు! తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    • By Naidu
    • October 30, 2026
    • 6 views
    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    • By Naidu
    • October 28, 2026
    • 20 views
    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    • By Naidu
    • October 26, 2026
    • 19 views
    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    • By Naidu
    • October 25, 2026
    • 19 views
    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    • By Naidu
    • October 16, 2026
    • 35 views
    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం

    • By Naidu
    • October 12, 2026
    • 34 views
    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం