ఖమ్మం మధ్య రైల్వే గేటు వద్ద ఆర్ఓబి గ్రీన్ సిగ్నల్

ఖమ్మం మధ్య గేటు వద్ద ఆర్వోబికి గ్రీన్ సిగ్నల్

  • భూ సేకరణ కోసం వేచి చూస్తున్నాం
  • రాష్ట్ర ప్రభుత్వం వెంటపడుతున్నాం
  • రాగానే పనులు మొదలు పెడతాం
  • ఎంపీ వద్దిరాజు వినతికి రైల్వే అధికారుల స్పందన

ఖమ్మం, డిసెంబర్, 16: మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు

ఖమ్మం నగరంలో రెండు ప్రధాన వ్యాపార కూడళ్లు గాంధీ చౌక్, కమాన్ బజార్లను కలిపే మధ్యగేటు వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబి) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే అందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి, తమ అప్పగిస్తే అక్కడ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ స్పష్టం చేశారు.
ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల కోరిక మేరకు మధ్య గేటు వద్ద బ్రిడ్జి నిర్మాణం కోరుతూ.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రైల్వే జీఎం కు గత నెలలో ఓ వినతిపత్రం అందజేశారు. ఆ మేరకు రైల్వే జీఎం స్పందించి ఆయకు ప్రత్యుత్తరం రాశారు. ఖమ్మం – పందిళ్ళపల్లి మధ్యలో 104 లెవెల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్వోబి
నిర్మాణం భూ సేకరణ అంశంతో ముడిపడి ఉన్నందున, అందుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రైల్వే జీఎం తెలియజేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలు పెడతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ తన లేఖలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కు స్పష్టం చేశారు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు