తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వక్స్ బోర్డు భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారుల ది

వక్ఫ్ భూములను పరిరక్షించాలి

ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్

ఖమ్మం (( మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 5 ))

ఖమ్మంలోని వెలుగుమట్ల శివారు గొల్లగూడెం గ్రామ పరిధిలో ఈద్గా , ఖబరస్తాన్‌తో పాటు వీటిపక్కనున్న సర్వే నెంబర్ 431, 432 , 425 సర్వే నెంబర్లలోని సుమారు 350 కోట్ల విలువ చేసే వక్ఫ్ భూమిని కొంతమంది ప్రయివేట్ భూమిగా చూపిస్తూ జిల్లా అధికారుల అండతో కాజేస్తున్నారని ఖమ్మం జిల్లా వక్ఫ్ భూముల పరిరక్షణ కొరకు ముస్లిం మహిళల అడహక్ కమిటీ కార్యదర్శి నజ్నీన్ , కోశాధికారి నస్రీన్ ఆరోపించారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
వారు మాట్లాడుతూ ముస్తాఫానగర్‌లో సర్వే నెంబర్ 481 , 482 , 483 , 484 , 485 లలో సుమారు 15 ఎకరాల 24 కుంటల భూమి ఉందని , వీటికి సంబంధించిన ముతవల్లీలు , వారి వంశీకులు కలిసి అక్రమంగా అమ్ముకున్నారని తెలిపారు . అలాగే వెలుగుమట్ల రెవెన్యూ గొల్లగూడెం పరిధిలో మొత్తం 72.29 కుంటల భూమి ఉందని అన్నారు . ఈ భూములలో ముస్లింల ప్రార్థనా స్థలం , ఖబరస్తాన్ ఉన్నయని , వీటికి ఎలాంటి నష్టం జరిగినా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు . వెలుగుమట్ల రెవెన్యూలోని 431 సర్వే నెంబర్ సుమారు 12 ఎకరాల 34 కుంటల భూమి ఉందని , దీనిలో 4 ఎకరాల 11కుంటల భూమిని వక్ఫ్ భూమి కాదని వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ ఆడిటర్ ఎన్‌ఓసి ఆర్డర్ రాసి ఇచ్చారని చెప్పి అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు . వక్ఫ్ ఇన్స్‌పెక్టర్ కనసైగలతో సర్వే నెంబర్ 425లో ఓ బిల్డర్ భవనాన్ని నిర్మించారని తెలిపారు . ఈ విషయమై కలెక్టర్‌కు , మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఆధారాలు సమర్పించామని అన్నారు . వెంటనే ఈ భూమిని ఆక్రమణ
దారుల నుండి కాపాడాలని కోరారు . ఈ సమావేశంలో నసీమా ఆర్సి , తరుణం ఫాతిమా , రఫియా , జరీనా , అనీఫా , ఆఫ్రిన్ , మెహ్రజ్ , ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు వైద్య కళాశాల పనులను…

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 0 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 17 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 26 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 17 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 24 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర