రఘునాధపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు

*రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం మన జ్యోతి బ్యూరో జూలై 3 వెంపటి నాయుడు

అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

మంత్రివర్యులు, గురువారం రఘునాధపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో పర్యటించి ఎస్సీ కాలని నందు సి.ఆర్.ఆర్.(ఎస్.సి.పి.) నిధులు 50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ తొలి విడతలో గుడిసెల్లో ఉన్న నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా గుడిసెలలో ఉన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు రాని పక్షంలో ప్రతిపాదనలు అందించాలని వెంటనే మంజూరు చేస్తామని, దశల వారీగా మిగిలిన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు.

గ్రామంలో గుడిసెలో ఉంటున్న వారి ఫోటోలు తీసుకొని రావాలని మంత్రి తెలిపారు. గ్రామంలో నిరుపేదలైన అర్హులకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ‌

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ అశోక్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, వేపకుంట్ల గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    సత్తుపల్లిలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకలు విజేత జట్లకు బహుమతులు అందజేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా.. సత్తుపల్లి, అక్టోబర్ 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి…

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    🌧️ జోరు వానను సైతం లెక్కచేయకుండా రక్తదాన శిబిరానికి తరలివచ్చిన పొంగులేటి అభిమానులు! సేవా స్ఫూర్తికి వర్షం అడ్డుకాదు.. ప్రాణదానానికి అభిమానుల ముందడుగు! తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    • By Naidu
    • October 30, 2026
    • 7 views
    సత్తుపల్లి పట్టణంలో ఘనంగా 73వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళల కబడ్డీ పోటీలు ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దంపతులు

    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    • By Naidu
    • October 28, 2026
    • 21 views
    రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన అభిమానులు

    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    • By Naidu
    • October 26, 2026
    • 21 views
    అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి మంత్రి అన్నారు

    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    • By Naidu
    • October 25, 2026
    • 20 views
    ఏదులాపురం మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాము అని మంత్రి అన్నారు

    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    • By Naidu
    • October 16, 2026
    • 36 views
    ఏసీబీకి పట్టుబడ్డ తాసిల్దార్ సర్వేయరీ

    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం

    • By Naidu
    • October 12, 2026
    • 36 views
    ఖమ్మం నగరంలో అల్లిపురం కొత్తగూడెం కొత్తూరు ప్రాంతంలో కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని శంకుస్థాపన కార్యక్రమం