


బేతుపల్లి చెరువులో 11 మంది ప్రాణాలు కాపాడిన ఖమ్మం జిల్లా కలెక్టర్, యంత్రాంగం మరియు సహాయక సిబ్బందికి
టీజీఈజెఎసి అభినందనలు!
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన ప్రమాదకర పరిస్థితుల్లో, గల్లంతైన మత్స్యకారులు మరియు వారిని రక్షించడానికి వెళ్లి చిక్కుకుపోయిన ఎస్డీఆర్ఎఫ్ (SDRF) సిబ్బందితో కలిపి మొత్తం 11 మంది ప్రాణాలను కాపాడిన అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అభినందనీయం.
సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఈ సాహసోపేత చర్యను విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్, దివాకర టి. ఎస్, ఎస్పీ రోహిత్, ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), అగ్నిమాపక సిబ్బంది మరియు జిల్లా యంత్రాంగం యొక్క సమన్వయ కృషిని టీజీ ఈ జెఎసి (TGEJAC) నాయకత్వం హృదయపూర్వకంగా అభినందించింది.
ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాల్లో ఆనందం నింపేలా అంకితభావంతో పనిచేసి, సకాలంలో స్పందించిన అధికారుల మరియు సిబ్బంది ధైర్యసాహసాలు ప్రశంసనీయమని టీజీ ఈ జెఎసి పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి
ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కి
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
టీజీఈజెఎసి చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీజీవో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, TNGOs రాష్ట్ర ఆర్గనైసింగ్ కార్యదర్శి ZS జైపాల్, ఎర్రా రమేష్, వల్లపు వెంకన్న,, తాళ్లూరి శ్రీకాంత్, చంద్రశేఖర్, హరికృష్ణ కోణార్, అస్లం ఖాన్, కోటపాటి రుక్మారావు, ప్రభాకర చారి, సైదులు, విజయ్, డాక్టర్ అసోసియేషన్ నుండి
డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ బాలకృష్ణ, అల్తాఫ్, స్రవంతి, వైద్య ఉద్యోగ సంఘాల నాయకులు కృష్ణరావు, వేణుగోపాల్, రమణ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.





