ఏసీబీ దాడులు…
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ నోరి లక్ష్మీ భాస్కర్ (56 సం.), తండ్రి: సత్యనారాయణ, నివాసం: ఫ్లాట్ నం. 811, ఎ-బ్లాక్, కల్పతరు అపార్ట్మెంట్స్, ఎర్రగడ్డ, హైదరాబాద్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది.
హైదరాబాద్ సెప్టెంబర్ 22 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్

ఇతను తన సేవా కాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు తేలింది…
ఈ నేరం అవినీతి నిరోధక చట్టం, 1988 (2018 సవరణ) లోని సెక్షన్ 13(1)(b), 13(2) కింద శిక్షార్హం కావడంతో,
22-09-2026న ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితులు, బినామీలు, ఇతర అనుచరులకు చెందిన మరో ఏడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించారు..
సోదాల్లో వెలుగుచూసిన ఆస్తుల వివరాలు:
గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ భవనంలో 1 ఫోర్-బెడ్రూమ్ ఫ్లాట్ పత్రాలు.
కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ భవనంలో 2 త్రిపుల్-బెడ్రూమ్ ఫ్లాట్లు.
మణికొండ, పేట్‌బషీరాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో 5 డబుల్-బెడ్రూమ్ ఫ్లాట్లు.
యాదాద్రి, శామీర్‌పేట, నందిగామలలో 4 ఓపెన్ ప్లాట్లు మరియు విశాఖపట్నంలో 800 చదరపు గజాల ఓపెన్ ప్లాట్.
బ్యాంకు ఖాతాల్లో నిల్వ: ₹41,00,000/-
పోస్టాఫీస్ డిపాజిట్లు: ₹12,00,000/-
ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు: ₹35,00,000/-
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు: ₹29,55,000/-
సుమారు 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు.
4 కార్లు: ఒక జాగ్వార్, ఒక ఆడి, ఒక టాటా నెక్సాన్.
4 ద్విచక్ర వాహనాలు: రాయల్ ఎన్ఫీల్డ్, వెస్పా, యాక్టివా, యమహా.
₹5,00,000/- విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.
ఈ ఆస్తుల దస్తావేజుల (డాక్యుమెంట్) విలువ మొత్తం ₹6,13,00,000/- కాగా,
బహిరంగ మార్కెట్ విలువ అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా…
అదనంగా, డీఆర్టీ (DRT) వివాదంలో ఉన్న ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేయడానికి ₹1,30,00,000/- పెట్టుబడి పెట్టినట్లు,
పలువురు వ్యక్తులకు చేతి బదులుగా ₹1,33,00,000/- ఇచ్చినట్లు సమాచారం లభించింది…
ఇతర అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోంది….






