పాల్వంచ మండలంలో మంత్రుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి

భద్రాద్రి జిల్లా (( మన జ్యోతి బ్యూరో జూలై 27.)) వెంపటి నాయుడు

🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఈరోజు పాల్వంచలోని ఐడిఓసి భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి గారు, పోరిక బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ గారు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో జిల్లాలో కురుస్తున్న వర్షాల పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, రైతులకు ఎరువుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, అభివృద్ధి పనుల నాణ్యత, రేషన్ కార్డుల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై సమగ్రంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ.. గతేడాది మాదిరిగా ముంపు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక నివాస శిబిరాలను సిద్ధం చేయాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య శాఖ ముందుగానే సన్నద్ధంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు, వైద్య సిబ్బంది, అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువుల్లో పూర్తి కావాలని, రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని మంత్రి అన్నారు. ప్రజల జీవితాల్లో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపించేలా చూడాలని, అధికారులు ఫీల్డ్‌లో ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గమనించి తక్షణ స్పందన ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అభివృద్ధి అనేది కేవలం కాగితాల మీద కాకుండా కంటికి కనిపించేలా ఉండాలన్నారు. ప్రతి కుటుంబం భద్రతగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 8 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 6 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 5 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 6 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 12 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క