టిజెఎఫ్ రజతోత్సవ మహాసభలను జయప్రదం చేయండి– తెలంగాణ కోసం పోరాడిన ప్రతి జర్నలిస్ట్ ఆహ్వానితులే– టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి

ఖమ్మం, మే 30 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001, మే 31న అల్లం నారాయణ సార్ సారధ్యంలో ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరం’గా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని 2001 నుండి 2014 వరకు అనేక పోలీస్ కేసులు, లాఠీ దెబ్బలు, జైలు పాలైన్నప్పటికీ పోరాటం ఆపకుండా తెలంగాణను సాదించుకున్నాం అన్నారు. తెలంగాణ సాధించుకున్న జర్నలిస్టు సంఘంగా టీజేఎఫ్ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో శనివారం జరిగే టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్నలిస్టులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం టీజేఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్న జర్నలిస్టు సంఘంగా టీజేఎఫ్ చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. టిజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా అల్లం నారాయణ సార్ సారధ్యంలో తెలంగాణ జర్నలిస్టులకు నలభై కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మరణించిన ప్రతి జర్నలిస్టు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం, భార్యలకు పెన్షన్, చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం ఇలా జర్నలిస్టుల సంక్షేమాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. అనంతరం జర్నలిస్టులు రజతోత్సవ సభలను జయప్రదం చేయాలని ఖమ్మం పట్టణంలో ప్రెస్ క్లబ్ నుండి పాత బస్టాండ్, జడ్పీ సెంటర్, బైపాస్ రోడ్డు, డిఆర్డీఏ, బస్ డిపో మీదుగా మయూరి సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు హైదరాబాద్ లో జరిగే రజతోత్సవ వేడుకలకు ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి ఉదయం 6 గంటలకు బస్సులు బయలుదేరును. జర్నలిస్టులు సమయపాలన పాటించి రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు వెన్నెబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, జిల్లా నాయకులు విజేత, మందటి వెంకటరమణ, మందుల ఉపేందర్, అమరవరపు కోటేశ్వరరావు, కాపర్తి నరేందర్, టీఎస్ చక్రవర్తి, శ్రీధర్ శర్మ, తిరుపతిరావు, ఉత్కంఠం శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీషా అశోక్, పాశం వెంకటేశ్వర్లు, హుస్సేన్, కొరకొప్పుల రాంబాబు, ముత్యాల కోటేశ్వరరావు, బిక్కి గోపి, మూల జీవన్ రెడ్డి, మోహన్, కిరణ్, సాయి, ఏబీఎన్ సాయి, పానకాలరావు, పులి శ్రీను, నల్లమోతు శ్రీనివాస్, వెంకట కృష్ణారావు, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, సునీల్, యాదగిరి, గిరి, వెంపటి నాయుడు, పెంటి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 79 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు