మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన ఆఫీస్ ని మూసేసింది!

2000, జూన్ నెలలో మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని పాకిస్థాన్ లో ప్రారంభించింది!

అఫ్కోర్స్! మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యాలయం ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు!

న్యూఢిల్లీ జాతీయ దినపత్రిక (( మన జ్యోతి ప్రచురించడం అయినది జులై 05 ))

2000 లో మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ లో తన కార్యకలాపాల కోసం కొత్తగా ఆఫీస్ ప్రారంభించాలని అని అనుకుంటున్నప్పుడు పాకిస్థాన్ కి చెందిన టెకీ అయిన జవ్వద్ రెహమాన్ మైక్రోసాఫ్ట్ తరుపున పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం కోసం సహకరించాడు. పాకిస్థాన్ లో ఉద్యోగులని ఇంటరవ్యూ చేసి ఉద్యోగులని రిక్రూట్ చేయడం తో పాటు కొన్నాళ్ళు అదే ఆఫీస్ లో పనిచేశాడు.

LinkedIn లో పోస్టు పెడుతూ రెహమాన్ భావోద్వేగానికి గురయ్యాడు. సరిగ్గా 25 ఏళ్ళ క్రితం పాకిస్థాన్ లో IT పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది అని భావించాను మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాల కోసం పాకిస్థాన్ లో ఆఫీస్ ఓపెన్ చేయడం దానిలో నేను భాగస్వామి ని అవడం మీద ఆనందం అనుభవించాను. కానీ ఇప్పుడు అదే కార్యాలయం మూతపడుతుండడం బాధగా ఉంది!

జవ్వద్ రెహమాన్ తన LinkedIn పోస్టులో పాకిస్థాన్ IT మంత్రికి విజ్ఞప్తి చేస్తూ మల్టినేషనల్ సంస్థలు ఒక్కొక్కటి పాకిస్తాన్ నుండి బయటికి వెళ్ళిపోతుండడం ఎందుకు జరుగుతున్నదో ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకొని పరిస్థితి చక్కదిద్దుతారని ఆశిస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు!

Well! Microsoft ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులని తొలగిస్తున్నది!

మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులలో 4% మందిని అంటే 9,100 మందిని తోలగిస్తున్నది. ఇది క్లౌడ్ బేస్డ్ మరియు భాగస్వామ్య పధ్ధతిలో తన కార్యకలాపాలని షిఫ్ట్ చేస్తున్న సందర్భంలో తీసుకుంటున్న చర్య అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది!

లాభాల పరంగా చూస్తే పాకిస్తాన్ ఏ విధంగానూ అనువైనది కాదని 2022 లోనే మైక్రోసాఫ్ట్ ఒక నిర్ణయానికి వచ్చినా మూడేళ్ల ఆలస్యంగా తన ఆఫీస్ తో పాటు అన్ని కార్యకలాలని ఆపేసింది మైక్రోసాఫ్ట్! కేవలం లైజన్ ఆఫీస్ లో ఐదుగురు ఉద్యోగులు మాత్రం కొనసాగుతారు!

ఇదంతా చైన్ రియాక్షన్!

ఆటోమోటివ్ దిగ్గజాలు అయిన సుజుకి, టొయోట, హోండా లు తమకి వ్యాపార అనుకూల పరిస్థితులు లేవని పాకిస్థాన్ నుండి వెళ్ళిపోయి చాలా కాలం అయ్యింది! హోండా 70సీసీ బైక్ ధర 1,60,000/- పాకిస్తాన్ లో. అఫ్కోర్స్! పాకిస్థాన్ లో అసెంబ్లీంగ్ యూనిట్స్ మాత్రమే నెలకొల్పయి జపాన్ ఆటో సంస్థలు. కోవిడ్ తరువాత అవి కూడా మూత పడ్డాయి.

మైక్రోసాఫ్ట్ వల్ల అంతో కొంత డాలర్ల రూపంలో ఫారెక్స్ పాకిస్తాన్ రిజర్వ్ బాంక్ లో జమ అయ్యేవి కానీ ఇకనుండి అదీ ఉండదు!

జైహింద్!

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 77 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు