రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందక ఆగిన గుండె

తెచ్చిన లోన్లు కట్టలేక..వచ్చే డబ్బులు రాక రిటైర్డ్‌ ఉద్యోగి మనోవేదన

గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి

నెల్లికుదురు, జూన్‌ 25 మన జ్యోతి బ్యూరో . వెంపటి నాయుడు

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండేటి సోమిరెడ్డి(63) రాజులకొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయడిగా విధులు నిర్వర్తించి 2024, సెప్టెంబర్‌ 2న ఉద్యోగ విరమణ పొందాడు.ఆయనకు రావాల్సిన రూ.54 లక్షల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పొందడానికి దరఖాస్తు చేసుకున్నాడు. రిటైర్మెంట్‌ కాక ముందు కొన్ని లోన్లు తీసుకున్నారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తో వాటిని చెల్లించాలని నిశ్చయించుకున్నాడు. రిటైర్‌ అయి 9 నెలలు గడుస్తున్నా సంబంధిత బెనిఫిట్స్‌ అందకపోవడం, పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న క్రమంలో.. రిటైర్డు అయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.. అందులో మీ నంబర్‌ ఎప్పుడో….? అని పలువురు అనడంతో అదే మాటను మనసులో పెట్టుకుని మనోవేదన గురై 14 రోజుల క్రితం బీపీ పెరగడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు.నాకు రావాల్సిన రిటైర్మెంట్‌ డబ్బులు రాలేదు..మీరు ట్రీట్‌మెంట్‌కు రూ. లక్షలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు..? రిటైర్మెంట్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయో..? ఎందుకు చికిత్స కోసం అప్పులు చేస్తున్నారు అంటూ సోమిరెడ్డి మనోవేదన గురయ్యేవాడు. మానసిక వేదనతో ఫిజికల్‌గా ట్రీట్‌మెంట్‌కు బాడీ సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి మృతి చెందాడు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వచ్చి ఉంటే తన తండ్రి చనిపోయేవాడు కాదని మృతుడి కుమారుడు కిశోర్‌కుమార్‌ వాపోయాడు.

  • Related Posts

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 6 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 23 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 23 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 19 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు