యుద్ధ ప్రతిపాదికన వెలుగుమట్లలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం మార్చి 28 మన జ్యోతి ప్రతినిధి పెంపటి నాయుడు

వెలుగుమట్లలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు….. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం

విద్యుత్, త్రాగునీటి సదుపాయాల పనులు పూర్తి

లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలి

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం, మార్చి – 28:

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీగా అభివృద్ధి చేసి పేదలకు గౌరవప్రదమైన జీవన వాతావరణం కల్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

శనివారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ మ్యాప్ ద్వారా వివరిస్తూ కాలనీలో ఇప్పటికే విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వీధి దీపాల పనులు పూర్తి అయ్యాయని, వాటర్ ట్యాంక్ నుండి ఇంటింటికీ త్రాగునీటి పైప్‌లైన్ అనుసంధానం జరుగిందని తెలిపారు. అలాగే అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల మౌళిక అవసరాలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి కుటుంబానికి త్రాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి సదుపాయాలు సమగ్రంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గత పది సంవత్సరాల కాలంలో పేదలు మౌళిక సదుపాయాల కొరతతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నాణ్యమైన గృహ నిర్మాణం పూర్తి చేయించడమే లక్ష్యమని అన్నారు.

వెలుగుమట్ల కాలనీలో విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, కాలువలు, పారిశుద్ధ్య వ్యవస్థ వంటి అన్ని సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేసి ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. కాలనీలో స్కూల్, కమ్యూనిటీ హాల్, పార్క్ వంటి సామాజిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. నెలలోపు డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేయాలని, వర్షాకాలం కాలనీలో నీటి నిలువ సమస్యలు ఉండకూడదని మంత్రి ఆదేశించారు.

హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసుకోవాలని మంత్రి సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ, నిర్దేశిత గడువులోనే అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, ఆర్&బీ ఎస్ఈ యాకుబ్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్లు డి. జయచందర్, సైదులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 8 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 6 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 5 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 6 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 12 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క