మున్నేటి ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని బోనాల మహోత్సవం

ఘనంగా గంగ భవాని బోనాలు

*ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు ఆగస్టు 10*

మున్నేటి నది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవాలయం నందు శ్రావణమాసం మూడవ ఆదివారం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే విధంగా గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. డప్పుల చప్పులతో పోతురాజుల విన్యాసాలతో మహిళలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని సామూహికంగా ఆలయానికి చేరుకొని చీర సారెలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కన్నం రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే విధంగా గంగమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని వేకువజామునే మున్నేరు నీటిని గంగమ్మకు అభిషేకించి, పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారని, గంగమ్మ తల్లి శాంతంగా ప్రవహిస్తూ పాడిపంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించాలని, మానవుల కు తాగునీరు సంతృప్తిగా అందాలని, మున్నేరు ఉగ్రరూపం దాల్చకుండా మానవ వనరులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నామని తెలిపారు ‌. కార్యదర్శి గోధుమల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలంతా గంగమ్మ తల్లికి ఐకమత్యంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, కోరిన వారి కొంగుబంగారంగా అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందిస్తుందని కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కన్నం వైష్ణవి, జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు కన్నం ప్రసన్న కృష్ణ, నగర అధ్యక్షులు చేతి కృష్ణ, మాజీ కౌన్సిలర్లు వంగాల వెంకట్ సింగం అంజయ్య జూబ్లీ పుర సారధి నగర్ సంఘం కోశాధికారి సోమనబోయిన కుమార్, నాయకులు చేతి శ్రీనివాస్, అంబటి రఘుబాబు, నరుగుల బలరాంశంకర్, పిల్లి ఐలేష్, అంబటి నవీన్ , పూస నరసింహారావు, కన్నం సందీప్, మైస కుమారస్వామి, పూజారి రాజు, కన్నం నరేందర్, తవిడబోయిన వీరేందర్, సోమనబోయిన సత్యం, మైస నవీన్, పిల్లి ఐలేష్, లెల్లల ప్రవీణ్, నరుగుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు రోడ్డు నిర్మాణానికి రూ.6.50 కోట్ల పరిపాలనా అనుమతిహైదరాబాద్, జూన్ 17 మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్…

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    BREAKING: సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్ హైదరాబాద్ జూన్ 17 మన జ్యోతి స్టేట్ బ్యూరో విజేందర్ తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరసింహారావును ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    • By Naidu
    • June 17, 2026
    • 8 views
    యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు రోడ్డు నిర్మాణానికి 6.50 కోట్లు పరిపాలన అనుమతులు

    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    • By Naidu
    • June 17, 2026
    • 6 views
    ACB : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అరెస్ట్

    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    • By Naidu
    • June 15, 2026
    • 5 views
    హైదరాబాద్ మహా నగరానికి అత్యంత అవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ

    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    • By Naidu
    • June 8, 2026
    • 6 views
    భావితరాలకు ఉపయోగపడేలా మా అభివృద్ధి పనులు నాణ్యతతో చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల

    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    • By Naidu
    • June 8, 2026
    • 7 views
    ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాలు

    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

    • By Naidu
    • June 7, 2026
    • 12 views
    పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క