ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేసిన బి ఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి ఆగస్టు 01

ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు

ఖమ్మం, ఆగస్టు 1:
ఈరోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ రైతు బజార్ అడ్డా నందు ఆటో కార్మికులు ఉత్సాహంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డా ప్రెసిడెంట్ బండారి బాబు, ఆటో కమిటీ సభ్యులు సమాఖ్యంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ పగడాల నాగరాజు గారు కేక్ కట్ చేసి కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటో కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, “గత 10 సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, గౌరవ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆటో కార్మికుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించారు. పోలీసుల, ఆర్టీఏ అధికారుల ఒత్తిడి లేకుండా, ఆటో కార్మికులకు రక్షణ కల్పించే విధంగా పనిచేశారు,” అని పేర్కొన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆటో డ్రైవర్లను మోసం చేస్తున్నదని ఆరోపించారు. “డబుల్ బెడ్‌రూం ఇళ్లు, సంవత్సరానికి ₹12,000 ఉపాధి ప్రోత్సాహం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వంటి హామీలను తక్షణమే అమలు చేయాలి,” అంటూ ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో BRTU ఆటో యూనియన్ జిల్లా నాయకులు సత్తార్ మియా, నగర కమిటీ సభ్యులు వేణు సంగం, అడ్డా నాయకులు శ్రీనివాసరావు, రఘు, శంకర్, శివ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని దినోత్సవాన్ని జరుపుకున్నారు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 80 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు