ఎస్సీ బాలుర హాస్టల్ (బి) విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు జనవరి 1

ఎస్సీ బాలుర హాస్టల్ (బి)విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన గ్రీటింగ్ కార్డ్స్ పై ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ ‘బి’ విద్యార్థులు తమ సృజనాత్మక ప్రతిభను చాటుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించిన కొటేషన్స్ పొందుపరుస్తూ, స్వయంగా తయారు చేసిన అందమైన గ్రీటింగ్ కార్డులను జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి దంపతులకు, అదనపు కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాస రెడ్డి కి, జిల్లా అధికారులు శ్రీమతి గుడికందుల జ్యోతి, నారీ విజయలక్ష్మి, టీఎన్జీవోస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్ లకు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యార్థులు ఎంతో శ్రద్ధతో, కృషితో రూపొందించిన ఈ గ్రీటింగ్ కార్డులు వారిలోని ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించాయని ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
జిల్లాలో హాస్టల్ సంక్షేమ అధికారులు మరియు సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు హర్షనీయమని అధికారులు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి గుడికందుల జ్యోతి, వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు, సూపర్నిడెంట్స్ రహీముద్దీన్, వెక్కిరాల శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది అస్లాం ఖాన్, శంకర్, రాకేష్,నెల్లూరి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, తిరుపతిరావు, నరేందర్, రమేష్, హనుమంతరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    “వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి” కూసుమంచి జూలై 18 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు “ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం…

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికత విప్లవం

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 22 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 16 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 22 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    • By Naidu
    • July 9, 2026
    • 18 views
    మానవత్వానికి చిరునామా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్ దాతృత్వం – 40 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు

    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

    • By Naidu
    • June 30, 2026
    • 20 views
    రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి