స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

స్టేషన్ ఘనపూర్ మే 30 మన జ్యోతి బ్యూరో.

నియోజకవర్గంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాను

విద్య విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు

కళాశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయి పరిశీలన

కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రిన్సిపల్, అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జూన్ 31 కల్లా కళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే

స్టేషన్ ఘనపూర్ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది

2025 – 26 విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కళాశాల తరగతుల నిర్వహణ ప్రారంభం

శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ కళాశాల తరగతుల నిర్వహణ

వచ్చే ఏడాది విద్యార్థులకు శాశ్వత డిగ్రీ కళాశాల భవనం అందుబాటులోకి

డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి *౼ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు*

====================

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తరగతులు ప్రారంభించుకోబోతున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి తెలియజేశారు. శుక్రవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని శివునిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ కళాశాల తరగతుల నిర్వహణ నేపథ్యంలో కళాశాలలో విద్యార్థులకు కనీస వసతుల ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా కళాశాలో ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ఎమ్మెల్యే కళాశాల ప్రిన్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ…. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. మార్చి నెలలో 8 కొట్ల 4 లక్షల 59 వేల రూపాయలతో నూతన డిగ్రీ కళాశాల మంజూరు రావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. డిగ్రీ కళాశాలకు అవసరమైన 18 మంది అధ్యాపకులు, 8 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఏర్పాటుకు మంజూరు రావడం జరిగిందన్నారు. BA, BCom Computer, BSC Computer, MPC, BZC life sciences, Computer కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. మొత్తం 240 సీట్ల అడ్మిషన్ల కొరకు విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని తెలిపారు. నూతన డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు పొందే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సూచించారు.

ఉపాద్యాయులు అకింత అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడుతుందని, ప్రభుత్వ విద్యాలయాలు దయనీయ స్థితికి చేరకుండా ఉంటుందన్నారు. ప్రస్తుతం డిగ్రీ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వెంటనే టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్స్, ఫర్నిచర్, డిజిటల్ బోర్డు, త్రాగునీరు సౌకర్యాలతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వచ్చే ఏడాది కల్లా శాశ్వత డిగ్రీ కళాశాల భవనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే తెలియజేశారు. అందుకు సంబంధించి త్వరలోనే టెండర్స్ పిలవడం జరుగుతుందన్నారు. విద్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి హెచ్చరించారు. కమిట్మెంట్ తో పని చేసే వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే ప్రభుత్వ విద్యాలయాల్లో హాజరు శాతం పెరుగుతుందన్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులంతా కలిసి డ్రైవ్ చేపట్టి మౌలిక వసతులతో పాటు మంచి ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. నియోజకవర్గంలోని విద్యాలయాల్లో మౌలిక వసతుల ఏర్పటు కోసం 10 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, D.E, R.D.O, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం -ఈనెల 10న ఉద్యోగులసభకు ఖమ్మం నుంచి పెద్దఎత్తున తరలిరావాలి: టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు. ఖమ్మం, సెప్టెంబర్ 5: మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    • By Naidu
    • September 13, 2026
    • 38 views
    ఖమ్మం నగరంలో భారీ బైకు  ర్యాలీతో జనసేన పార్టీ అతిరథ మహారధులు ఎస్సార్ అండ్ బిజీ కాలేజీ నుండి ఎంబి గార్డెన్ వరకు కదం తొక్కిన జనసేన వీరనారీమణులు పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని ప్రసంగంలో తెలియజేశారు

    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    • By Naidu
    • September 5, 2026
    • 26 views
    ఉద్యోగాల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాo

    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    • By Naidu
    • August 25, 2026
    • 27 views
    మంత్రి తుమ్మల విశేష కృషి … గిరిజన ప్రాంతంలో విద్యా జ్యోతి

    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    • By Naidu
    • August 6, 2026
    • 40 views
    మాజీ సుడా  డైరెక్టర్ పల్లా కిరణ్ కుమార్తె పుట్టినరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 35 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 80 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు