




ఖమ్మం టిడిపి కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఖమ్మం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశంపార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యాలయంలో ఘనంగా ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది, ముందుగా కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం తెలంగాణ రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా కార్యాలయంలో తెలుగుదేశంపార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ గారు 1982 లో తెలంగాణ గడ్డపై హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో పటిస్తాత్మకంగా పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కొరకు ఈ పార్టీని స్థాపించారని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, కిలో రెండు రూపాయలు బియ్యం, వృద్ధులకు పింఛన్, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజాదారణ పొందిన పార్టీ అని కొనియాడారు, నేటికి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు, అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ కూడలిలో గల ఎన్టీఆర్ గారి విగ్రహానికి నేతలు పాదయాత్రగా బయలుదేరి నివాళులర్పించారు, అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు ల స్పీచ్ తిలకించడం జరిగింది, అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, కార్యక్రమానికి వచ్చిన సీనియర్ నాయకులకు హడ్ హక్ కమిటీ సభ్యులు మరియు ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం వారికి శాలువాలతో సత్కరించి ఘన సన్మానం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కేతినేని హరీష్, వడ్డేం విజయ్, గుత్తా సీతయ్య, వనమ వాసు, మందడపు సుధాకర్, మంద వెంకటనారాయణ, మండపూడి శ్రీనివాస్, గుండెపిన్ని నాగేశ్వరరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, మీగడ రామారావు, నాగార్జున శ్రీనివాస్, రాజరాజేశ్వరి, మేకల సత్యవతి, చలసాని ఝాన్సీ, నల్లమల రంజిత్, కన్నేటి పృధ్వీ, నాగండ్ల లక్ష్మణ్, నున్నా నవీన్, బ్రహ్మం, నల్లమల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు






