ఏదులాపురం మున్సిపాలిటీ ఖమ్మం రూరల్ మండలం ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమం అభివృద్ధి పాలన అందించటమే ప్రజా ప్రభుత్వం మంత్రి పొంగులేటి

ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు

  • తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఏదులాపురం మున్సిపాలిటీ/ఖమ్మం రూరల్ : ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ పేదలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా వెంకటగిరి ప్రాంతంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్, చింతపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ… వెంకటగిరి లో రూ. 2 కోట్ల 55 లక్షల రూపాయలతో చేపట్టిన మిని స్టేడియం నిర్మాణ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు. తాజాగా రూ. 2 కోట్ల 50 లక్షల రూపాయలతో 33/11 కె వి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసు కున్నామని అన్నారు.

ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామంలో ఒక కోటి 10 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి ఖమ్మం – వరంగల్ హై వే రోడ్డు నిర్మాణానికి, ఒక కోటి 43 లక్షలతో నిర్మించనున్న చింతపల్లి నుండి తిరుమలాయపాలెం – ఆరేకోడు బీటీ రోడ్డు నిర్మాణానికి తాజాగా శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. గడిచిన ఇరవై నెలల కాలంలో ఇందిరమ్మ రాజ్యంలో చింతపల్లి గ్రామానికి దాదాపు రూ. 24 కోట్ల 74 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం మంజూరు చేశామని అన్నారు.

గ్రామంలో బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, పెండింగ్ ఉన్న రోడ్లు, పాఠశాల అభివృద్ధి పనులకు నిధులను విడతల వారిగా మంజూరు చేసి పూర్తి చేసే బాధ్యత తనదని మంత్రి తెలిపారు. పేదలకు ఇండ్ల స్థలాలు అందించే అవకాశాన్ని పరిశీలించి అర్హులకు చేరేలా చూడాలని మంత్రి రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ 200 యూనిట్ల ఉచితవిద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహాయం 12 వేలకు పెంపు, సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

సన్న వడ్లు పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు సొంతిల్లు అందించే పథకం నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. రాబోయే 3 సంవత్సరాలలో మూడు విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అన్నారు.

అనంతరం 56 మందికి కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం రూరల్ మండలం తహసీల్దార్ రాం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 50 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 36 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 43 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం