భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణదారుల ఐదు వాహనాలు సీజ్…

అక్రమ స్థిర చర ఆస్తులు అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు : పోలీస్ కమిషనర్

ఖమ్మం:(( మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ))
భూదాన్, ప్రభుత్వ భూముల దురాక్రమణకు పాల్పడి పేద ప్రజల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి కూడగట్టుకున్న సుమారు 45 లక్షల విలువ చేసే స్థిర చర ఆస్తుల అటాచ్మెంట్ కోసం చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇప్పటికే నిందితుల నుండి10 లక్షల 40 వేల విలువ చేసే ఐదు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ ప్రాంతంలోని భూదాన్, ప్రభుత్వ భూములపై అక్రమ వ్యాపారాలకు, ఆక్రమణలకు పాల్పడిన నిందుతులపై ఖమ్మం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్, ఇతర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆయా కేసులలో విచారణలో బాగంగా ఖానాపురం హవేలి పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకున్న నిందుతులు 1) బల్లి శ్రీనివాస్ @ శ్రీను, 2)పోలెబోయిన ముత్తయ్య, 3) కొప్పెర వెంకన్న, 4) తాళ్లూరి కృష్ణ, 5) కుంజా కృష్ణయ్య @ కృష్ణ, 6) కల్తీ రామ చంద్రయ్య, 7) బాణాల లక్ష్మణాచారి ని విచారణలో వెల్లడించిన వివరాలు ప్రకారంగా సుమారు 1549 మంది పేద ప్రజల (బాధితుల) నుండి వసూలు చేసిన రూ 2,88,38100/- డబ్బుల నుండి కొంత వరకు కోర్టుకు ఖర్చులకు, ర్యాలీలు, సర్వేలు, భూదాన్ వినోబా నవోదయ కాలనీలో తాత్కాలికంగా నిర్మించుకున్న ఇండ్లకు కరెంటు, నీరు, మిగతా సౌకర్యాల పేరుతో ఖర్చు చేశారని,మిగిలిన డబ్బును స్వప్రయజనాలకు, స్థిర ఆస్తుల సంపాదించుకోవడం కొరకు ఖర్చు పెట్టినట్లు నేరాన్ని అంగీకరించారని తెలిపారు.

1)తాళ్లూరి కృష్ణ, ఒక ట్రాక్టర్ ను నెం. AP 20 TA 1363, కవిరాజ్ నగర్, రోడ్డు నెo.1 లో 64.54 గజాలవిస్తీర్ణంలో ఇంటిపై 19 లక్షల 90 వేల రూపాయలు ఖర్చు చేసి మొదటి, రెండవ అంతస్తు నిర్మాణం చేశారు.

2) బాణాల లక్ష్మణాచారి, హీరో డీలక్స్ మోటార్ సైకిల్ నెం. TS-05-ER-1100, కొనుగోలు చేశారు.

3) పోలెబోయిన ముత్తయ్య, టాటా మ్యాజిక్ వాహనము నెం. TS-28-T-2868, టాటా ఇంట్రా ట్రాలీ వాహనము నెం. TS-04-UE-6290,

5) కొప్పెర వెంకన్న, స్ప్లెండర్ మోటార్‌సైకిల్ మోటార్ సైకిల్ నెం. TS-29-B-8489,
10 లక్షల విలువగల ఇండ్ల స్థలం,తన కొడుకు చదువులకు ఖర్చు చేసినాడు.

6) చిప్పలపల్లి వీరయ్య, 4 లక్షల 48 వేల ఏడు వందల నాలభై నాలుగు రూపాయల నగదును, 10 లక్షల రూపాయలు ఎన్కూరు కు చెందిన పొన్నెబోయిన బేబీ వద్ద ఉంచినారు, ఎన్నికల సమయంలో వారి పార్టీ మీటింగులకు కొంత ఖర్చు చేసినారని, అలాగే హుస్నా బాద్ పార్టీ మీటింగ్ కు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసినారని, ఇతర ఖర్చులకు, స్వప్రయోజనాలకు వినియోగించినారని వారు అంగీకరించినారు.

కస్టడీ అనంతరం నిందుతులను తిరిగి ఈ రోజు జూడిసియాల్ రిమాండు తరలించడం జరిగింది.
స్థిర చర అస్తుల విలువ సుమారుగా

  1. వాహనములు (5) : రూ.10,40,000/-.
  2. ఇల్లు విలువ : రూ.19,90,000/-.
  3. ఇండ్ల స్థలం :
    రూ. 10 ,00,000/-.
  4. బ్యాంక్ ఖాతా లో ని నగదు : రూ.4,48,744 /-.
    మొత్తము అస్తుల విలువ సుమారు గా : రూ.44,78,744 /-
  • Related Posts

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    ఖమ్మం ఆగస్టు 3 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు వైద్య కళాశాల, యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలి… రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు వైద్య కళాశాల పనులను…

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    ఖమ్మం ఆగస్టు 02 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీక బోనాలు- మాజీ మంత్రి పువ్వాడ ఖమ్మం నగరంలోని 30వ డివిజన్‌లో ఘనంగా నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి శ్రీ పువ్వాడ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    • By Naidu
    • August 3, 2026
    • 0 views
    వైద్య కళాశాల. యంగ్ ఇండియా స్కూల్ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు

    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    • By Naidu
    • August 2, 2026
    • 17 views
    30. డివిజన్లో బోనాల పండగ అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు

    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    • By Naidu
    • July 18, 2026
    • 26 views
    వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి

    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    • By Naidu
    • July 17, 2026
    • 17 views
    హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ క్యాన్సర్ నిర్ధారణ చికిత్స రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం

    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    • By Naidu
    • July 17, 2026
    • 23 views
    యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ అంకాలజీ రోబోటిక్ సైన్సెస్ డాక్టర్ చినబాబు మీడియాకి తెలియజేశారు

    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర

    • By Naidu
    • July 11, 2026
    • 24 views
    సారపాక బ్రిడ్జి కింద నుంచి ప్రతిరోజు రాత్రి వేళల్లో మొదలవుతున్న అక్రమ ఇసుక రవాణా జాతర