11 వ తారీకు తర్వాత మీ సంగతేందో తెలుస్తా మంత్రి

11వ తేదీ తర్వాత మీ సంగతి తేలుస్తా!

​● చందాలు.. దందాలు చేస్తే.. కింద పడుద్ది జాగ్రత్త!

​● కారుకూతలు కూస్తే బొక్కలోకి పంపడం ఖాయం

​● ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచార ముగింపు సభలో మంత్రి పొంగులేటి ‘స్ట్రాంగ్ వార్నింగ్’

ఏదులాపురం మున్సిపాలిటీ మన జ్యోతి బ్యూరో వెంపటి నాయుడు ఫిబ్రవరి 9

“రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తామన్నా… ఫోన్లలో బెదిరింపులకు దిగినా సహించేది లేదు. 11వ తేదీ ఎన్నికలు ముగియనివ్వండి.. హద్దులు దాటిన ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తా. చందాలు, దందాలు చేస్తే కింద పడుద్ది జాగ్రత్త! తింగరి వేషాలు వేస్తే ఊరుకోం.. చట్టప్రకారం మీ అందరినీ బొక్కలో వేయించడం ఖాయం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

​దందాలకు కాలం చెల్లింది..
​ప్రచార పర్వంలో ప్రత్యర్థుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. “ఎవరైనా కారుకూతలు కూస్తే చట్టరీత్యా ఉక్కుపాదం మోపుతాం. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరు. మీ దందాలకు, దౌర్జన్యాలకు ప్రజలు ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి.. అశాంతి సృష్టించాలని చూస్తే ఉక్కుపాదం మోపుతాం” అని స్పష్టం చేశారు.

​అధికారం లేని మీరు అభివృద్ధి ఎలా చేస్తారు?
రంగురంగుల కండువాలు వేసుకుని వస్తున్న నాయకులను మంత్రి సూటిగా నిలదీశారు. “అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ సాయం ఉండాలి. అధికారంలో ఉన్న మేమే పనులు చేయగలం. ఏ అధికారం ఉందని మీరు మేలు చేస్తామంటూ ప్రజల వద్దకు వస్తున్నారు? పదేళ్లు అధికారంలో ఉన్న ఆ ‘దొర’లకు పేదలకు ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేదు” అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు, హాస్టల్ విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు వంటి ఎన్నో సంక్షేమ ఫలాలను అందించామని గుర్తుచేశారు.

​ఏప్రిల్‌లో ‘ఇందిరమ్మ’ ఇళ్లు..
*వచ్చే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని మంత్రి ప్రకటించారు. “ప్రభుత్వ భూముల్లో ఇళ్లు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత నాదే. ఏదులాపురాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా” అని హామీ ఇచ్చారు. మున్నేరు వరద బాధితులకు అండగా ఉన్నామని, వచ్చే వర్షాకాలం నాటికి రిటైనింగ్ వాల్ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.

సభ అనంతరం వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి నాయుడు పేట సర్కిల్ వరకు వేలాది మందితో జరిగిన భారీ ర్యాలీలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Related Posts

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    ఖమ్మం ఏప్రిల్ 21 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు.. రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. …వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై మాజీమంత్రి…

    హైదరాబాద్ తెలంగాణ

    ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    • By Naidu
    • April 21, 2026
    • 9 views
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని విమర్శించే అర్హత పువ్వాడ అజయ్ కు లేదు

    హైదరాబాద్ తెలంగాణ

    • By Naidu
    • April 21, 2026
    • 15 views
    హైదరాబాద్ తెలంగాణ

    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    • By Naidu
    • April 9, 2026
    • 49 views
    ఆ ఐదు పంచాయతీల్ని తెలంగాణలో కలపాలి

    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    • By Naidu
    • April 2, 2026
    • 36 views
    భూదాన్ ప్రభుత్వ భూములు దురాక్రమదారుల దగ్గర నుండి 5 వాహనాలు సీజ్

    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    • By Naidu
    • April 1, 2026
    • 43 views
    ఖమ్మం జిల్లా ఉప సర్పంచ్ల సంఘానికి నూతన కార్యవర్గం

    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం

    • By Naidu
    • March 29, 2026
    • 41 views
    శ్రీకర్ హాస్పిటల్ ఆర్థోపెడిక్ హైదరాబాద్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం