ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతికత మంత్రి తుమ్మలకు లేదు, ఖబడ్దార్ అని హెచ్చరిక
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 19వతేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. 👉🏻ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
👉🏻ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రజలకిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించారు
👉🏻రైతు రుణమాఫీ నూటికి నూరు శాతం ఎక్కడ అమలయిందో నిరూపించాల్సిందిగా మంత్రి తుమ్మలకు సవాల్ విసిరారు.
👉🏻మొక్కజొన్న పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు,కష్టాల గురించి ఆవేదన వ్యక్తంచేశారు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంగళవారం ఎమ్మెల్సీ,పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు
👉🏻హరీష్ రావు ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పలేక ఇష్టారీతిన అవాకులు చెవాకులు మాట్లాడారు
👉🏻కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విషయంలో
న్యాయ కోవిదులను కలిసేందుకు సోమవారం నేను, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లడం జరిగింది.
👉🏻మేము వేరే ఎవరినో కలిసేందుకు వెళ్ళినట్లుగా తుమ్మల నిరాధారమైన ఆరోపణలు చేశారు
👉🏻వాస్తవాలను తెలుసుకోకుండా మంత్రి తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న
👉🏻హరీష్ రావు ఖమ్మం జిల్లాకు రావడమే తప్పు అన్నట్లుగా,వరదలు వచ్చినప్పుడు ప్రజలకు సాయం చేసేందుకు,అండగా నిలబడేందుకు వచ్చినప్పుడు రాళ్లు వేయించారు
👉🏻హరీష్ రావు ఖమ్మం వస్తే తుమ్మల,ఆయన అనుచరులు భయపడిపోతున్నారు.
👉🏻ఆయన వచ్చినప్పుడల్లా అడ్డుపడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు
👉🏻హరీష్ రావు పోటీ చేసిన ప్రతిసారి భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
👉🏻అదే తుమ్మల ఎన్నో సార్లు ఓటమి చవిచూశారు.
👉🏻 హరీష్ రావును విమర్శించే నైతిక హక్కు నాగేశ్వరరావుకు లేదు.
👉🏻హరీష్ రావు పై ఆయన చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్న
👉🏻మంత్రిగా ఆయన ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదు
👉🏻 పంజాబ్,ఢిల్లీ,కేరళ ముఖ్యమంత్రులను కేసీఆర్ ఖమ్మంకు ఆహ్వానించి సభ పెడితే అందులో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనుల గురించి తుమ్మల మాట్లాడారు,అప్పుడే అది మర్చిపోతే ఎట్ల?
👉🏻అదే సభలో అడిగిందే తడువుగా కేసీఆర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన 180 కోట్లు మంజూరు చేశారు
👉🏻జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగాన్ని లక్షలమంది వీక్షించారు
👉🏻ఆ సభను నీరుకార్చాలనే
కుయుక్తితో మంత్రులు నాగేశ్వరరావు, లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు నోటికొచ్చినట్టుగా మాట్లాడారు
👉🏻ప్రధాన ప్రతిక్షంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే,పాలకులు బురదజల్లుతున్నారు,భూతుల పంచాగం విప్పుతున్నారు
👉🏻రైతన్నలను రుణాలను 49 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని మొదట చెప్పి,చివరకు కేవలం 23 వేల కోట్లు మాత్రమే చేశారు
👉🏻రైతుభరోసా సాయం సక్రమంగా లేదు,వడ్లు,ధాన్యం కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది,పంటలకు బోనస్ అందడం లేదు,కరెంట్,యూరియా సరఫరా సక్రమంగా లేదు
👉🏻రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కూడా పలుమార్లు విద్యుత్ కోతలు తలెత్తుతున్నాయి
👉🏻సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ మాసన పుత్రిక,దాని ద్వారా గోదావరి నీళ్లను పాలేరులో కలపాలని ప్రణాళిక సిద్ధం చేస్తే,ఇప్పుడది మంత్రి తుమ్మల వల్ల ఆగిపోయింది
👉🏻 కేసీఆర్ ముందు చూపుతో భక్త రామదాసు పథకం ద్వారా తిరుమలాయపాలెంకు నీళ్లు వస్తే,వాటిని తలపై పోసుకుని ఇప్పుడు నా జన్మ ధన్యమైనదని నాగేశ్వరరావు చెప్పడం నిజం కాదా?
👉🏻ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు మూతపడే పరిస్థితులు తలెత్తాయి,విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది
👉🏻 బీఆర్ఎస్ పాలనలో రూ.8లక్షల కోట్ల అప్పులు చేశారనడం పచ్చి అబద్ధం
👉🏻 కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా రూ. 2 లక్షల 90వేల కోట్ల అప్పులు మాత్రమే చేశారని ప్రకటించారు.
👉🏻ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇందుకు రాష్ట్ర ప్రజలకు సమాధానమివ్వాలి
👉🏻మంత్రి నాగేశ్వరరావు గెల్చిన ఖమ్మం నియోజకవర్గానికి చేసిన మేలు ఏమి లేదు
👉🏻 పామాయిల్ తోటల గురించి మాట్లాడే మంత్రి తుమ్మల, వాటిని సాగు చేసే రైతుల కష్టాలను పట్టించుకోలే
👉🏻వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ నేను రైతులను వెంట తీసుకుని ఢిల్లీలో మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశాను
👉🏻 తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిపోయింది
👉🏻 కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన 432 హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు జరుగట్లేదు
👉🏻 కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సాధించి పెట్టిన తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు పదవులు అనుభవిస్తున్నారు
👉🏻వారిని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదు,ఇంకోసారి అవాకులు చవాకులు పేలితే తెలంగాణ ప్రజలు సహించరు కాక సహించరు ఖబడ్దార్.







