ఐదు గ్రామపంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి -ఏలూరి శ్రీనివాసరావు
ఖమ్మం ఏప్రిల్ 9 మన జ్యోతి ప్రతినిధి వెంపటి నాయుడు







**విషయం: భద్రాచలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ భద్రాచలం లో ఏప్రిల్ 13 వ తేదీన టీజీఈజేఏసీ అధ్యర్యములో ‘అభ్యర్థన సదస్సు.
టీజీఈజేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం పుణ్యక్షేత్రం మరియు దాని పరి పరిసర ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను (పురుషోత్తపట్నం, గుండాల పిచ్చికలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం మరియు పిచ్చికలపాడు) తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈ జేఏసీ (TGEJAC) కోరుతున్నది.
ఈ నేపథ్యంలో, ఈ నెల 13వ తేదీ, సోమవారం (ఏకాదశి) నాడు భద్రాచలంలోని పాత ఆర్ అండ్ బి (R&B) బిల్డింగ్ మైదానంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భారీ **”అభ్యర్థన సదస్సు” అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులచే నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఈ ఐదు పంచాయతీల ప్రజలు వైద్య, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ సేవల కోసం వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాలు విలీనమైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు, ఈ సదస్సుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు (తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు), ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని,
ఉద్యమంలో జర్నలిస్టులు, ఉద్యోగులు ఏ విధంగా పోరాడారో, అదే స్ఫూర్తితో ఈ విలీనం కోసం కూడా పోరాడాలని ఇది కేవలం రాజకీయ అంశం కాదు, భద్రాద్రి రామయ్య భూములను కాపాడుకోవడం మరియు స్థానిక ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న సామాజిక బాధ్యత అని,
కేంద్ర ప్రభుత్వం మరియు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించి, శాస్త్రీయంగా ఈ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
యావత్తు ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు అందరూ ప్రజా ప్రతినిధులని ప్రజలని ప్రజా సంఘాలని ఉద్యమ సంఘాలని విద్యార్థి సంఘాలని జర్నలిస్టుల్ని ప్రొఫెషనల్స్ అందరిని కూడా మేము ఉద్యోగ సంఘాలుగా సమన్వయం చేయడానికి ఒక దండకి దారం ఎలా ఉంటుందో అలా పని చేసేవాళ్ళమే. మీరు ముందు ఉండి నడిపియాలి ఈ ఐదు పంచాయతీలు కూడా వస్తేనే సంపూర్ణమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి రాము రామాలయం డెవలప్ కావాలన్నా తెలంగాణ భవిష్యత్తు తూర్పు దిశగా పెరగాలన్న ఈ ఐదు గ్రామ పంచాయతీల కీలకం. ఈ ఐదు గ్రామ పంచాయతీలు కూడా సరైన రహదారులు గాని విద్యా వైద్య సౌకర్యాలు గాని ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి వీటి పరిష్కారానికి ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలన్నారు.
ఈ అభ్యర్థన సదస్సును విజయవంతం చేయవలసిందిగా అఖిల పక్ష నాయకులను, విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలను మరియు జర్నలిస్టు మిత్రులను ఉమ్మడి ఖమ్మం జిల్లా టీజీఈజేఏసీ సాదరంగా ఆహ్వానిస్తోందని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో భద్రాద్రి పునరేగీకరణ విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో టీజీఈజెఎసి ఖమ్మం జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్, రెవిన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, టీజీవో అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరావు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుబ్బయ్య,హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరాస్వామి, టీపీటీఫ్ కార్యదర్శి వెంగలరావు,యుటిఎఫ్ అధ్యక్షలు రంజాన్ , టిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, ఫోర్త్ క్లాస్ అసోసియేషన్ బాధ్యులు బిక్కు, వెంకటరమణ, హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ విజయకుమార్, మున్సిపల్ అసోసియేషన్ సుధాకర్ బుర్రి వెంకటేశ్వర్లు, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీరస్వామి, హెచ్ డబ్ల్యు ఎస్ అధ్యక్షులు రుక్మారావు, జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ కొప్పిశెట్టి సురేష్, పెన్షనర్స్ అసోసియేషన్ వేణు, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ బుర్రి వినోద్ కుమార్, మార్కెటింగ్ అసోసియేషన్ ఆంజనేయులు, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అస్లాం, సయ్యద్ జిలాని, టీజీవో నాయకులు సూరంపల్లి రాంబాబు, తాజుద్దీన్, గోపాలకృష్ణ కృష్ణార్జున తిరుపతిరావు, టీఎన్జీఓస్ మహిళా విభాగం చైర్ పర్సన్ మృదుల, నాయకులు తాళ్లూరి శ్రీకాంత్, ఎర్రమళ్ళ శ్రీనివాసరావు,కోణార్, విక్కిర్యాల శ్రీనివాస్, జెడ్ ఎస్ జైపాల్ మల్లోజు వెంకన్న , పొట్ట పెంజర రామయ్య, కెవి రమణ రవికుమార్ తాళ్లూరు చంద్రశేఖర్, గుడిపూడి శ్రీనివాస్, ఎంవీ వీరయ్య, దుర్గాప్రసాద్, రమణ యాదవ్, ఎర్రమల శ్రీనివాస్ చంద్రశేఖర్ గౌడ్, గజ్జల మృదుల ఎర్ర రమేష్, అజ్మత్ బెగ్, గఫూర్, లింగం సురేష్ , టీజీవో, టీఎన్జీవో, ఉపాధ్యాయ, అధ్యాపక, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఉద్యోగులు సకల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు





